Showing posts with label manikya malaraya poovi. Show all posts
Showing posts with label manikya malaraya poovi. Show all posts

Saturday, 17 February 2018

అభిమానులను లైవ్‌లో ఫిదా చేసిన ప్రియ | Priya Praksh Varrier


కనుసైగతోనే అందరి హృదయాలను కొల్లగొట్టి తనవైపు తిప్పుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియ ప్రకాశ్‌ వారియర్‌. ఒక్క వీడియోతోనే ఆమె ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ అయిపోయింది. రాత్రికి రాత్రే ప్రియకు విపరీతమైన ఫేమ్‌ వచ్చేసింది. ‘ఒరు అదార్‌ లవ్’‌ చిత్రంలోని ‘మణిక్య మలరాయ పూవి’ పాటలో ఆమె కళ్లతో పలికించిన హావభావాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్‌లో ఆమె గన్నుతో మరోసారి హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు వైరల్‌ అయిన తర్వాత తొలిసారిగా ప్రియ అభిమానుల ముందుకు వచ్చింది.
‘ఒరు అదార్‌ లవ్’‌ టీజర్‌లో ప్రియ ముద్దును గన్‌లో లోడ్ చేసి ప్రేమికుడికి గురి పెట్టి పేల్చేసిన సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు ఇదే సీన్‌ను ప్రియ లైవ్‌లో చేసింది. స్టేజ్‌ మీద తెరపై టీజర్‌ వస్తుండగా.. ప్రియ, రోషన్‌ అదే సన్నివేశాన్ని ప్రేక్షకుల ముందు చేశారు. అనంతరం ఆమె ముద్దును గన్‌లో మరోసారి లోడ్‌ చేసి ప్రేక్షకులకు గురి పెట్టి పేల్చారు. ఇంకేముందు ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా ఈలలు, అరుపులతో హోరెత్తిపోయింది. లైవ్‌లో ఆమె చేసిన అభినయానికి అందరూ మరోసారి ఫిదా అయిపోయారు.