Showing posts with label raviteja nela ticket. Show all posts
Showing posts with label raviteja nela ticket. Show all posts

Saturday, 17 February 2018

Raviteja Neala Ticket Movie | నేలటికెట్‌

                                               Related image

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనర్జీకి మారు పేరు ఎవరంటే?తడుముకోకుండా టక్కున్న చెప్పేపేరు రవితేజ. సినిమా అంటే అంతలా హుషారుగా పనిచేస్తారాయన. చాలా రోజుల విరామం తర్వాత వరుస సినిమాలను ప్రకటించిన ఆయన కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ మూవీస్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శాటిలైల్‌, డిజిటల్‌, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ రూ.25కోట్లకు ఓ ప్రముఖ టెలివిజన్‌ దక్కించుకుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. షూటింగ్‌ దశలో ఉండగానే ఈ స్థాయిలో బిజినెస్‌ జరగడం రవితేజ స్టామినాకు నిదర్శనమని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. తాజా చిత్రానికి ‘నేల టికెట్‌’ అనే పేరు పరిశీలనలో ఉంది. మాళవిక శర్మ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఇక ఇటీవల విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం‘టచ్‌ చేసి చూడు’. బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను అందుకుంది.