
Saturday, 17 February 2018
అభిమానులను లైవ్‌లో ఫిదా చేసిన ప్రియ | Priya Praksh Varrier
కనుసైగతోనే అందరి హృదయాలను కొల్లగొట్టి తనవైపు తిప్పుకున్న మలయాళీ ముద్దుగుమ్మ ప్రియ ప్రకాశ్ వారియర్. ఒక్క వీడియోతోనే ఆమె ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది. రాత్రికి రాత్రే ప్రియకు విపరీతమైన ఫేమ్ వచ్చేసింది. ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని ‘మణిక్య మలరాయ పూవి’ పాటలో ఆమె కళ్లతో పలికించిన హావభావాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ టీజర్‌లో ఆమె గన్నుతో మరోసారి హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోలు వైరల్ అయిన తర్వాత తొలిసారిగా ప్రియ అభిమానుల ముందుకు వచ్చింది.
‘ఒరు అదార్ లవ్’ టీజర్‌లో ప్రియ ముద్దును గన్‌లో లోడ్ చేసి ప్రేమికుడికి గురి పెట్టి పేల్చేసిన సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు ఇదే సీన్‌ను ప్రియ లైవ్‌లో చేసింది. స్టేజ్ మీద తెరపై టీజర్ వస్తుండగా.. ప్రియ, రోషన్ అదే సన్నివేశాన్ని ప్రేక్షకుల ముందు చేశారు. అనంతరం ఆమె ముద్దును గన్‌లో మరోసారి లోడ్ చేసి ప్రేక్షకులకు గురి పెట్టి పేల్చారు. ఇంకేముందు ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా ఈలలు, అరుపులతో హోరెత్తిపోయింది. లైవ్‌లో ఆమె చేసిన అభినయానికి అందరూ మరోసారి ఫిదా అయిపోయారు.
Raviteja Neala Ticket Movie | నేలటికెట్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనర్జీకి మారు పేరు ఎవరంటే?తడుముకోకుండా టక్కున్న చెప్పేపేరు రవితేజ. సినిమా అంటే అంతలా హుషారుగా పనిచేస్తారాయన. చాలా రోజుల విరామం తర్వాత వరుస సినిమాలను ప్రకటించిన ఆయన కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. గత నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో శాటిలైల్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.25కోట్లకు ఓ ప్రముఖ టెలివిజన్ దక్కించుకుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. షూటింగ్ దశలో ఉండగానే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం రవితేజ స్టామినాకు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తాజా చిత్రానికి ‘నేల టికెట్’ అనే పేరు పరిశీలనలో ఉంది. మాళవిక శర్మ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఇక ఇటీవల విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం‘టచ్ చేసి చూడు’. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది.
Thursday, 8 February 2018
Subscribe to:
Posts (Atom)
-
గ్రాట్యూటీ అంటే ఆ సంస్థకు చేసిన సేవలకుగాను సంస్థ ఉద్యోగికి కొంత మొత్తంలో చెల్లించే డబ్బులే గ్రాట్యూటీ అని పిలుస్తాం. గ్రాట్యూటీ ఏ పరిశ్ర...